NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆర్డినెన్సుకు సర్కార్ ఆమోదం తీసుకుంది. ఇవాళ రాత్రికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది.
AP CM: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు.
CM Chandrababu: సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
Srisailam Dam: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు ఇప్పటి వరకు ఏడు గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.
కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు.