AP CM React on SC Classification: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సున్నిపెంట సభలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఎస్సీ కులాలను ఏబీసీడీ వర్గీకరణ సబబు అని చెప్పింది.. 1996-97 ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా.. సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు.
AP CM Review Meeting: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు.
Fake Documents: ఏలూరు జిల్లాలోని నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం చేసింది. ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టికి వెళ్ళటంతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 66- 2 సర్వే నెంబర్ గల భూమికి 25. 46 ఎకరాలను నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కు ముఠా తెగబడింది.
Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు.
MLC Elections 2024: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం వచ్చే నెల 7న జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు కర్నూలు జిల్లాలోన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోని శ్రీశైల ప్రాజెక్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు సమాచారం.
Bank Fraud: గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా స్కామ్స్ వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం కొనసాగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుల రుణాల పేరుతో బ్యాంకు సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.