Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ
CPI Ramakrishna: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు అని ఆరోపించారు.
Ambati Rambabu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ లు మొదలు పెట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు.. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు.
AP Home Minister: విశాఖపట్నంలో నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి నివారణ మీద సమీక్ష చేపట్టినట్లు తెలిపారు.
Chandrababu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి ఇవాళ ( మంగళవారం ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయి ఫణీంద్ర చికిత్స కోసం తగిన సాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం అందించారు.
Sharad Pawar: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు.. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అబద్దాలు చెప్పారు.
Mamata Banerjee: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేసింది. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆరోపించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. భారత్‌లోని ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం.. వారందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాసుకొచ్చారు.
Tihar Jail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్న తీహార్ జైలులో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గొడవ జరగడంతో.. ఓ ఖైదీ పదునైన ఆయుధంతో తోటివారిపై దాడికి దిగడంతో.. ఇద్దరు ఖైదీలు గాయపడినట్లు జైలు అధికారులు ఇవాళ (శనివారం) తెలిపారు.