Indian students: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం లాంటి.. పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
Netanyahu Meets Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలిశారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు.
Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు.
Building Collapses: మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఇవాళ (శనివారం) మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు దాదాపు ఖరారు అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో అధికారికంగా తెలిపింది.
PM Modi Ukraine Tour: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు తెలుస్తుంది.
NITI Aayog: నీతి ఆయోగ్ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగబోతుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
BJP New President: భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసిపోవడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అనే విషయం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు తెలిపినప్పటికి.. తాజాగా ఆగస్టు నెల చివరి నాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల దగ్గర పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాయి.