Srisailam Dam: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు ఇప్పటి వరకు ఏడు గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.. అవుట్ ఫ్లో 2. 50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215. 8 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం జలశయంలో నిల్వ 207. 41 టీఎంసీలు ఉంది.
Read Also: Beauty Skin: ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ దండగ.. చౌకగా వచ్చే ఇది ఉండగా..
ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోని కుడి, ఎడమగట్లలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి మరింత వరద కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జలశయానికి చేరుకుంటున్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారిపోయాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.