Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తీవ్ర నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మరో మ్యాచ్ ఆడనున్నారు.
Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా మారాయి అన్నారు. ఇక, మూడు నధుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
Mandipalli Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో శాఖల పని తీరుపై సమీక్షించారు.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఆఫీస్ & ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసింది. హీరా గ్రూప్ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగి పోయారు. కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు ఈడీ గుర్తించింది.
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు కరెంటు ఇవ్వాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ట్రిప్ అయితే కరెంటు ఇచ్చేవాళ్ళు కాదు.. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి కంప్లైంట్ వస్తే అర్ధరాత్రి కూడా వెళ్లి కరెంటు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం.
Minister Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ధరణి అన్న సంగతి ఈరోజుకి కూడా వాళ్ళు తెలుసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు.
Sandra Venkata Veeraiah: ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపిపిలకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేశారు.
Damodar Raja Narasimha: కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. సుప్రీం కోర్టు తీర్పు అమలుపై చర్చ జరిగింది. ఈ మీటింగ్ కు మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు అని చెప్పుకొచ్చారు.