Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా మారాయి అన్నారు. ఇక, మూడు నధుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.. సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు సాగుతున్నాయి.. త్వరిత గతిన పూర్తి చేస్తామన్నారు. గత పదేళ్లుగా మేకపాటి కుటుంబం నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదు అంటూ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి ఆరోపించారు.
Read Also: America: సరస్సులో మునిగి భారతీయ యువకుడి మృతి..28 రోజుల తర్వాత మృతదేహం
అలాగే, ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 12. 80 కోట్ల రూపాయలను మంజూరు చేశాం అని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమృత్-2 పథకం ద్వారా 9.4 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఆత్మకూరు పట్టణానికి ప్రతి రోజు తాగు నీటిని అందిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఆత్మకూరులో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైంది.. ఆత్మకూర్ ప్రజలకు సేవ చేసేందుకు తాను నిరంతరం కృషి చేస్తాను.. ఆత్మకూరుకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాం అని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి వెల్లడించారు.