హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఆఫీస్ & ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసింది. హీరా గ్రూప్ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగి పోయారు. కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు ఈడీ గుర్తించింది. తెల్లవారు జాము నుంచి తనిఖీలు కొనసాగాయి. నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది. హైదరాబాద్ టోలీచౌకిలోని ఫ్లాట్‌లను అధికారులను స్వాధీన పరుచుకున్నారు.
Read Also: TG Bharath: శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లను తయారుచేయాలి.. మంత్రి టి.జి భరత్..
టోలీచౌకిలోని ఎంఎస్పీ కాలనీలో ఉన్న మొత్తం 80 కోట్ల రూపాయల విలువైన 81 ఫ్లాట్లు సీజ్ చేశారు. ఇప్పటి వరకు 380 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులను ఈడీ అటాచ్ మెంట్ చేసింది. ఇంకా రూ.600 కోట్ల పైచిలుకు ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయనున్నట్లు సమాచారం. నౌహిర షేక్ పై దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడా పెట్టుకున్నారని ఆరోపణలపై.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌పై గతంలో కేసు నమోదు చేశారు.