Minister Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ధరణి అన్న సంగతి ఈరోజుకి కూడా వాళ్ళు తెలుసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మా ప్రభుత్వం రాగానే ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతూమని ఆనాడే చెప్పామన్నారు. నిన్న అసెంబ్లీలో ఈనాటి ప్రతి పక్షమైన బీఆర్ఎస్ నాయకులు మా ధరణి వల్ల కోటి మంది ఆనందంగా ఉన్నారని వారి సొంత డబ్బా కొట్టుకున్నారు అంటూ మండిపడ్డారు. దేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిలో ఉన్న మంచిని తీసుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకు రాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Daggubati Purandeswari: రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ పర్యటన..
ఆనాటి ప్రభుత్వం లాగా కాకుండా ప్రజా అభిప్రాయాలతో మంచి చట్టాన్ని తీసుకురాబోతున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆ చట్టం యొక్క వివరాలు పబ్లిక్ డోన్ లో పొందుపరచడం జరుగుతుంది.. కౌవులు, కళాకారులు గ్రామాల్లో ఉన్న రైతులు ప్రతి ఒక్కరి సూచనల మేరకు మంచిని తీసుకొని మంచి రెవెన్యూ చట్టాన్ని తయారు చేయబోతున్నామన్నారు. రైతాంగం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరగకుండా ఈ పేదోడి ప్రభుత్వం రైతన్నలకి మంచి చట్టాన్ని ప్రవేశ పెడుతుంది.. నా సొంత నియోజకవర్గమైన పాలేరు పాత కాలువకి నీటిని విడుదల చేయడం జరిగింది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.