Bangladesh Crisis: బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు ఇవాళ (సోమవారం) హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పెట్టి పారిపోయారు.
Bangladesh PM Resign: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆర్మీ పాలనను చేతుల్లోకి తీసుకోనున్నట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థల ద్వారా కథనాలు వెలువడుతున్నాయి.
Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.
Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
Kesineni Chinni: ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
Nadendla Manohar:పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్ల, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. ఇక, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తాం.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల గడువు ఇస్తున్నామన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారు పేరుగా మారిపోయింది అన్నారు.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు.