YS Vijayamma: వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాదేస్తుందన్నారు.
Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేశారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులు చేశారు
AP Cabinet: నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో గల సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందన్నారు. క్రికెట్ బోర్డు బాగా పని చేస్తోంది.. చంద్రబాబు నుంచీ ప్రామిస్ అనేకంటే ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది.. ఇండియన్ గోల్ఫ్ కి నేను ప్రెసిడెంట్.. ఎక్కడ భూమి ఇస్తుందనేది ప్రభుత్వానిదే నిర్ణయం.. స్పోర్ట్స్ సిటీ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను.. 20 సంవత్సరాల నుంచి క్రికెట్ లో ముందున్నామని కపిల్ దేవ్ వెల్లడించారు.
Minister Anagani: తిరుపతికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఇక, 140 రోజుల్లో ముఖ్యమంత్రి ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.. ప్రతి పేద వాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అమలు చేశారని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాం.. రాష్ట్రంలో సినారేజ్ చార్జీలు లేకుండా ఇసుక అందిస్తున్నాం.. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని వెల్లడించారు.
Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ స్టార్ట్ అయింది. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు.. ఈ భూముల్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.. ఏమనుకుంటున్నారు?.. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయింది.. అసైన్డ్ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదు.. రింగ్ రోడ్డు అప్పుడు కూడా ఇలానే అసైన్మెంట్ భూములకు రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్ రెడ్డితో కొట్లాడాం.
హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.