గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్లక్ష్యం చేసింది అని మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. పేదల కోసం తలపెట్టిన టిడ్కో ఇళ్లను కూడా నాశనం చేసింది అని మండిపడ్డారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోధరల స్ధిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్ గానూ కమిటీలను ఏర్పాటు చేసినట్లు సర్కార్ వెల్లడించింది.
కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని సీఎం రేవంత్ సూచించారు. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదు.. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు.
Nadendla Manohar: గుంటూరు జిల్లాలోని తెనాలి ఐతనగర్లో రౌడీ షీటర్ దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకుమాను ఇంద్రజిత్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.
Anitha- Pawan: మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిపారు.