Zelensky: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా నార్త్ కొరియా రష్యాకు భారీగా సైనికులను తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా బలగాలు మాస్కో్కి చేరడంపై చైనా మౌనం వహించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు.
Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.
Iran-Israel: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఇరాన్ రెడీ అవుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ ఈ దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
AP Deputy CM: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.
Kandula Durgesh: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu: బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Nimmala Ramanaidu: మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరానికి ఉరి అని 45.72 నుంచి 41.15కు తగ్గిస్తున్నట్టు ఇవాళే చూసినట్టు రాసారు.. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో నేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం..
చిన్న పొరబాటు జరిగిన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
Pawan Kalyan: ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.