Kapil Dev – Chandrababu: టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో సమావేశం అయ్యారు. కాగా, ఏపీలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విస్తృత కార్యక్రమాల గురించి చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలపై కూడా సీఎం చంద్రబాబు కు చాలా ఉత్సుకత ఉందన్నారు. గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందన్నారు. క్రికెట్ బోర్డు బాగా పని చేస్తోంది.. చంద్రబాబు నుంచీ ప్రామిస్ అనేకంటే ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది.. ఇండియన్ గోల్ఫ్ కి నేను ప్రెసిడెంట్.. ఎక్కడ భూమి ఇస్తుందనేది ప్రభుత్వానిదే నిర్ణయం.. స్పోర్ట్స్ సిటీ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను.. 20 సంవత్సరాల నుంచి ముందున్నాం క్రికెట్ లో.. చాలా పాజిటివ్ మాత్రమే నేను మాట్లాడుతాను అని కపిల్ దేవ్ వెల్లడించారు.
Read Also: Allu Arjun: బాలయ్య ముందు నంద్యాల విషయంపై బన్నీ కామెంట్స్
ఇక, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. అనంతపురం, అమరావతి, విశాఖలలో గోల్ఫ్ కోర్టులు పెడతామన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ను మన రాష్ట్రానికి అంబాసిడర్ గా ఉండాలని కోరాం.. గోల్ఫ్ ను కూడా ఏపీలో అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం.. గోల్ఫ్ కు డ్రైవింగ్ రేంజీలు సిద్ధం చేస్తాం.. మరో రెండు మూడు మీటింగ్ లలో నిర్ణయిస్తాం.. ఏపీలో యువ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తామన్నారు. గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను వెలికితీస్తాం.. గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ ను అభివృద్ధి చేస్తామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
Honored to meet cricket legend Shri Kapil Dev today, discussing exciting developments for new stadiums in Amaravati and Vizag. Later met @ncbn garu to explore further possibilities for enhancing sports infrastructure in AP. Great things ahead for cricket enthusiasts!… pic.twitter.com/33wCyjTk0K
— Kesineni Sivanath (@KesineniS) October 29, 2024