Parliaments Session: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 24న ఆల్ పార్టీ మీటింగ్
- నవంబర్ 24వ తేదీన అఖిలపక్ష సమావేశం..
- ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్..
- సమావేశాల్లో కీలక బిల్లులకు మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను కోరనున్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliaments Session: ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు (మంగళవారం) తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు సెంట్రల్ సర్కార్ మీటింగ్ కు ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్ సెషన్స్ లో చర్చించే ఛాన్స్ ఉంది.
Read Also: Tecno Pop 9 Launch: ‘టెక్నో పాప్ 9’ వచ్చేస్తోంది.. ధర 10 వేల కంటే తక్కువే!
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ఇక, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అలాగే, రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఈ నెల 26వ తేదీన ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాగా ఇప్పటి వరకూ నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తుండేవారు. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్ 26వ తేదీని మోడీ సర్కార్ రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తుంది.
Read Also: Justice Sanjiv Khanna: ఢిల్లీలో వాయు కాలుష్యం.. వర్చువల్‌గా కేసుల విచారణ
మరోవైపు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు లాంటి మొదలైనవి సభ ముందుకు రానున్నాయి. ఈ సెషన్స్ లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇంకోవైపు, జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు-2024ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అధికార, విపక్షాలు సభ్యుల మధ్య పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ కొనసాగే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!