Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం
- దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ క్షిణిస్తున్న గాలి నాణ్యత..
- 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదైతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. కాగా, నేడు (బుధవారం) సచివాలయ అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నామని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పని చేయనున్నాయన్నారు. ఇప్పటికే ఒకటి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
Read Also: Rafael Nadal Retirement: పరాజయంతో కెరీర్‌ను ముగించిన ‘స్పెయిన్ బుల్’!
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అయితే, ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతుండంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం గాలి నాణ్యత సూచీ 422గా రికార్డైంది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన పడుతున్నారు. దీని వల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఇక, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..