ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు.
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది.
NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మాజీ డైరెక్టర్ బలరామ్తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద సోమవారం నాడు కేసు నమోదు అయింది.
4-Day Work Week: యునైటెడ్ కింగ్డమ్లో పని భారాన్ని తగ్గించడానికి అక్కడి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు 200 బ్రిటీష్ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఎటువంటి జీతం కోల్పోకుండా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని ప్రకటించాయి.
Ind vs Eng 3rd T20: టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
IAS Officers Transfer: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం నాడు అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.