Union Budget 2025: బడ్జెట్కు ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే!
- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్..
- యూనియన్ బడ్జెట్ సమర్పించే కంటే ముందు కొన్ని కీలక అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా కొనసాగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు.. ఆ తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించే ముందు మీరు కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకోవాలి.
Read Also: Gudem Mahipal Reddy: నేడు పీసీసీ కమిటీ ముందు హాజరు కానున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి!
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
1) వార్షిక బడ్జెట్: ఒక ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాల పూర్తి ప్రణాళికనే వార్షిక బడ్జెట్ అంటారు. ఇందులో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు దీన్ని రూపొందిస్తారు. రాష్ట్ర బడ్జెట్ అయితే అసెంబ్లీలో, కేంద్ర బడ్జెట్ అయితే పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.
2) బడ్జెట్ అంచనా: మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగాలు, ప్రభుత్వ పథకాలకు కేటాయించాల్సిన అంచనా నిధులనే బడ్జెట్ అంచనా అంటారు. ఇందులో డబ్బులు ఎక్కడు, ఎలా ఖర్చు చేయాలనేది తెలియజేస్తుంది. ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాలనే దానిపై బడ్జెట్ అంచనాను రూపొందిస్తారు.
3) మూలధన వ్యయం: యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్య మొదలైన వాటి అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చించే డబ్బునే మూలధన వ్యయం అంటారు. ఇది, భవిష్యత్తులో లాభాలు లేదా డివిడెండ్‌ను ఇచ్చే ప్రభుత్వ భూమి, పెట్టుబడి వంటి స్థిరాస్తులను సంపాదించడానికి చేసే ఖర్చు కూడా ఇందులో భాగమే.
4) ఆర్థిక బిల్లు: కొత్త పన్నులు విధించడం, పన్ను నిర్మాణాన్ని మార్చడం లేదా ఇప్పటికే ఉన్న పన్నులను కొనసాగించడం లాంటి విధానాన్ని ప్రవేశపెట్టేదే ఫైనాన్స్ బిల్లు.
5) ద్రవ్య లోటు: గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మొత్తం వ్యయం, రాబడి రాబడుల మధ్య వ్యత్యాసం ఉంటే దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఈ వ్యత్యాసాన్ని ఇతర చర్యలతో పాటు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం ద్వారా పూరించబడుతుంది. దీన్ని జీడీపీగా లెక్కిస్తారు.
6) పరోక్ష పన్నులు: మార్కెట్లో ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే పన్నునే పరోక్ష పన్నులు లేదా ఇండైరెక్ట్ టాక్స్ అని పేర్కొంటారు.
7) ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం అనేది దేశంలో వస్తువులు, సేవలు, వస్తువుల సాధారణ ధరల పెరుగుదలను సూచిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ వినియోగదారుల కొనుగోలు శక్తి బలహీనపడుతుంది.
8) కొత్త పన్ను విధానం: 2022లో ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానంలో ఏడు పన్ను స్లాబ్‌లు రాయితీ రేట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో.. ఇది డిఫాల్ట్ పాలనగా మారింది.. పాత పన్ను విధానం ఒక ఎంపికగా మారిపోయింది.
9) పాత పన్ను విధానం: పాత పన్ను విధానంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి 30 శాతం అత్యధిక పన్ను రేటుతో కేవలం నాలుగు స్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి.
10) పన్ను మినహాయింపు: డిస్కౌంట్, పన్ను బిల్లు కోసం విధించదగిన పన్ను మొత్తాన్ని తగ్గిస్తుంది. PPF, NSC, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి పన్ను పొదుపు సాధనాలను ఉపయోగించడం ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.
11) మిగులు బడ్జెట్: బడ్జెట్‌లోని ఖర్చులు ఆదాయాలను మించినప్పుడు ఏర్పడే తేడానే సర్‌ప్లస్ బడ్జెట్ అంటారు. ఇది, ప్రభుత్వ ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే.. దాన్ని మిగులు బడ్జెట్ అంటారు.
12) లోటు బడ్జెట్: ఖర్చులు ఆదాయాలను మించినప్పుడు లోటు ఏర్పడుతుంది. సంస్థలు లేదా ప్రభుత్వాల ఆదాయాల కంటే ఖర్చులు పెరిగిన సందర్భంలో ఉండే తేడానే లోటు బడ్జెట్ అంటారు.
13) రాయితీలు: నిర్దిష్ట రంగాలకు లేదా వ్యక్తులకు ప్రభుత్వాలు ప్రోత్సహించడం కోసం ఇచ్చే డబ్బునే రాయితీ అంటారు. ఈ రాయితీలు సాధారణంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్య రంగాలకు అందజేస్తుంటారు.
14) అప్పులు: వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వాలు ఇతరులకు చెల్లించాల్సిన మొత్తాలే అప్పులు అంటారు. ఈ అప్పులను దీర్ఘకాల అప్పులు, తాత్కాలిక లేదా స్వల్పకాల అప్పులుగా విభజించారు.
15) ఆర్థిక విధానం: ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చులను నియంత్రించే విధానమే ఈ ఆర్థిక విధానం. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్థిక విధానం ఎంతగానో తోడ్పుతుంది.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!