Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 9pm 27th January 2025

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :January 27, 2025 , 9:09 pm
By Chandra Shekhar Pamena
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్నీ తెలియాలి.. 11,114 కోట్లు స్టీల్ ప్లాంట్ కు, పోలవరానికి 12,750 కోట్లు, అమరావతికి అప్పుగా 15 వేల కోట్ల రూపాయలు ఇప్పించారు అని ఆయన పేర్కొన్నారు. వాటిని తక్షణం పూర్తి చేయాలి.. అక్కడి నుంచి నిధులు మళ్లించలేను అన్నారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెబుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తెరుకోగానే తల్లికి వందనం, రైతుకు అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీకి ఐదేళ్ల విలువైన సమయం పోయింది.. 2019 నాటికి ఉన్న వృద్ధిరేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేది అన్నారు. రూ. 9.5 లక్షల అప్పుకి వడ్డీ కట్టాలి, అసలు చెల్లించాలని వెల్లడించారు. ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని పేర్కొన్నారు. ఇప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం.. జరిగిన డ్యామేజ్ తో నాకేం సంబంధమని సామాన్య పౌరుడు ఆలోచిస్తాడు.. అలా ఆలోచించడం లోనూ తప్పులేదన్నారు. అందుకే వారికి అన్ని విషయాలు చెబుతున్నాం.. సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అప్పుల పేరుతో చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఉహించలేదంట.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు.. అందుకే సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే వాగ్దానాలు అమలుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని.. అమలు చేయలేరని జగన్ ఎన్నికల ముందే చెప్పేశారని కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక అసలు నిజాలు చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రం అప్పు 6 లక్షల నలభై వేల కోట్లు మాత్రమే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడని, ఎన్నికల ముందు కూటమి నాయకులు చెప్పారు అని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పిన దానికన్నా, జగన్ తక్కువే అప్పులు చేశారు అన్నారు. అప్పులు ఉన్నా హామీలు అమలు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అలాగే, దావోస్ పర్యటన ఖర్చులు ఎంత?.. చేసుకున్న వ్యాపార ఒప్పందాలు ఎంత?.. దారి ఖర్చులకైనా పెట్టుబడులు వచ్చాయా?.. అని మాజీమంత్రి అంబటి ప్రశ్నించారు.

అమెజాన్ గిఫ్ట్ కార్డుపై మరోసారి స్పందించిన పవన్ కళ్యాణ్
అమెజాన్ గిఫ్ట్ కార్డులో పెట్టిన డబ్బు కార్డు కాలం చెల్లినపుడు తిరిగి రాకపోవడంపై మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమెజాన్ ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడువు తీరిన వెంటనే వినియోగదారుడి ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యేలా చూడాలని అమెజాన్ కు తెలిపారు. ఇలాంటి సమస్యకు సులభమైన పరిష్కారం ఇవ్వాలని అమెజాన్ ను ఆయన కోరారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లో డబ్బులను ఉంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మీ కార్డ్ లేదా యూపీఐ సమాచారాన్ని నమోదు, లావాదేవీలు సరి చూసుకోవాలని వెల్లడించారు. గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్ నుంచి బ్యాలెన్స్‌ను రికవరీ చేసేటప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా కస్టమర్ కేర్ సేవను సంప్రదించాలని పేర్కొన్నారు. వారికి పరిస్థితిని వివరించి, సరళమైన ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.

సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు..
సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా.. సరస్వతీ నది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని కొండా సురేఖ చెప్పారు.
మరోవైపు.. సరస్వతి నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 2013లో వచ్చిన సరస్వతీ నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కాగా.. సరస్వతీ పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కేంద్రమంత్రికి లేఖ..
తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నాబేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి-కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘన అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి రెండు లేఖలు రాయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండడం శోచనీయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు TAC అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ NOC జారీపై కేంద్రం జోక్యం అవసరం అని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు.

‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘‘సనాతన’’ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఉదయనిధికి సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్ పిటిషన్లను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌ని ఎలా కొనసాగించవచ్చని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ పరిష్కారాలను కోరుకునే స్వేచ్ఛను పిటిషనర్లకు కల్పించింది. 2023 సెప్టెంబర్‌లో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం’’ సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని, మలేరియా, డెంగ్యూలాగా దానిని నిర్మూలించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. డీఎంకే తీరును ప్రశ్నించాయి. ఈ వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచార అస్త్రంగా మారింది.

డొనాల్డ్ ట్రంప్‌కి ప్రధాని మోడీ ఫోన్.. డియర్ ఫ్రెండ్ అంటూ..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఫోన్ చేశారు. ఇద్దరు నాయకులు భారత్-అమెరికా మధ్య సంబంధాల గురించి చర్చించారు. ‘‘ నా ప్రియమైన మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆయన చారిత్రత్మక రెండవ పదవీ కాలం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపాను. పరస్పరం ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాము అని మోడీ చెప్పారు. నవంబర్ 07 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడారు. ఆ సమయంలో ఇరువురు నేతల సంభాషణలో, ట్రంప్ ప్రధాని మోడీని ప్రశంసించారు. మోడీ అద్భుతమైన వ్యక్తిగా, ప్రపంచం మొత్తం ఆయనను ప్రేమిస్తోందని అన్నారు. భారతదేశం ఒక అద్భుతమైన దేశమని, ప్రధాని మోడీని, భారతదేశాన్ని తాను నిజమైన మిత్రులుగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇరువురు నాయకులు కలిసి పనిచేయడానికి అంగీకరించారు.

వరుణ్ సందేశ్ నెగెటివ్ పాత్రలో రాచరికం.. జనవరి 31న రిలీజ్
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు మూవీ ప్రీ రిలీజ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ టైటిల్లోనే ఓ రాయల్టి ఉంటుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూపిస్తామా? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుందన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలో నెగెటివ్ పాత్రను చేశాను. మైఖేల్ తరువాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ సినిమాలో నటించాను. సురేశ్ మరియు ఈశ్వర్ అద్భుతంగా తీశారు.

ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్ గా రికార్డ్!
జస్ ప్రీత్ బుమ్రా.. బుల్లెట్ లాంటి బంతులతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను చతికిలపడేస్తాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా 2024కి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభకనబర్చినందుకు గాను బుమ్రాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కాగా బుమ్రా గతేడాది 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జో రూట్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ మైలురాయిని సాధించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆరో భారత ప్లేయర్‌గానూ బుమ్రా నిలిచాడు. ఇంతకుముందు ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ సహా కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • international
  • national
  • telangana
  • Top Headlines 9pm

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions