Non-veg Food At Temple: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ దేవాలయ కొండపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ కానీ మాంసాహారం తిన్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. దీనిపై రామనాథపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా అతడి చేసిన అభియోగాలను నిరూపించలేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.
Donald Trump: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో త్వరలో సమావేశం అవుతానని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తప్పకుండా.. అతడికి నేనంటే ఇష్టం.. కిమ్ చాలా స్మార్ట్ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు.
Halwa Ceremony: కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి.
Huge Blast: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లాలోని జవహర్ నగర్ లో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రోజు (జనవరి 24) భారీ పేలుడు సంభవించింది.
Novak Djokovic: తన కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్‌ను గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి సెట్ తర్వాత రిటైర్డ్‌హర్ట్ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసాయ్ బీచ్‌లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులను చెప్పింది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా విదేశీ వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు తేలింది.
BDCC Bank: కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు. కాగా, 2025 జనవరి 10వ తేదీ నుంచి విజయనగరం, బళ్లారి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బళ్లారి జిల్లా సహకార కేంద్ర (బీడీసీసీ) బ్యాంకుకు చెందిన కస్టమర్ల ఖాతాలకు ఆన్లైన్ లో బదిలీలు జమ కావడం లేదని పలు శాఖలు నివేదించడంతో.. జనవరి 13వ తేదీన ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
Manish Sisodia: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా సంచలన కామెంట్స్ చేశారు. తాను తిహాడ్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసింది..