Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డులో పెట్టిన డబ్బు కార్డు కాలం చెల్లినపుడు తిరిగి రాకపోవడంపై మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమెజాన్ ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడువు తీరిన వెంటనే వినియోగదారుడి ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యేలా చూడాలని అమెజాన్ కు తెలిపారు.
ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
BC Janardhan Reddy: గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూశారు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయని పేర్కొన్నారు. మొత్తం రూ. 3, 014 కోట్లుతో పనులు చేస్తున్నాం.. రూ. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం అన్నారు.
Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఉహించలేదంట.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు.. అందుకే సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Nadendla Manohar: పేదల ఇళ్ల స్థలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ల్యాండ్ స్కాం.. తెనాలిలో జరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కొంత మంది పేదల భూముల పేరుతో.. రైతులకు తక్కువ డబ్బు ఇచ్చి ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తాన్ని దోచేశారు అని చెప్పుకొచ్చారు.
CM Chandrababu: నీతి అయోగ్ రిపోర్టుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం..
Nimmala Ramanaidu: గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు..
బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.