* నేడు రంగారెడ్డి జిల్లాలోని పొద్దటూరులో ఎక్స్ పీరియమ్ పార్క్ ప్రారంభం.. ఉదయం 11గంటలకు ఎక్స్ పీరియమ్ పార్క్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. హాజరుకానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిరంజీవి, మహేశ్ బాబు.. 85 దేశాల నుంచి మొక్కల సేకరణ.. 150 ఎకరాల్లో 25 వేుల మొక్కలతో ఎక్స్ పీరియమ్ పార్క్..
* నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా.. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ మహా ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు..
* నేడు బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడితే తమ స్టాండ్.. ఎలా ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ.
* నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోనున్న మంత్రి సబిత.. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టనున్న మంత్రి సవిత.
* నేడు అమరావతిలోనే ప్రజలకు అందుబాటులో ఉండనున్న మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు..
* నేడు బాపట్ల జిల్లాలోని చీరాల మండలం దేవాంగపురిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించనున్న మంత్రి కొలుసు పార్థసారధి..
* నేడు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11:30 గంటలకు జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం..
* నేడు భారీగా గంజాయి నిల్వలు ధ్వంసం చేయనున్న అనకాపల్లి జిల్లా పోలీసులు.. 35 వేల కేజీల డ్రై గాంజాను దగ్ధం చేసేందుకు ఏర్పాట్లు.. డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరగనున్న గంజాయి నిల్వల ధ్వంసం.
* నేటి నుంచి సెంట్రల్ జైలు ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభం.. ప్రత్యేక భద్రత నడుమ రోజుకి 30మంది చొప్పున రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ.. మొత్తం 200 మందిని తరలించేందుకు ఏర్పాట్లు..
* నేడు భారత మత్స్య పరిశోధన సంస్థ (FSI) ఓపెన్ హౌస్.. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల్లోకి సందర్శకులకు అనుమతి.. సముద్ర జలాల్లో నావిగేషన్, మత్స్య జాతుల పరిశోధనపై అవగాహన కల్పించనున్న సైంటిస్ట్ లు..
* నేటి నుంచి నాగోబా జాతర.. ఈరోజు రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్న మెస్రం వంశీయులు.. ఫిబ్రవరి 4 వరకు జరగనున్న కేస్లాపూర్ నాగోబా జాతర.. నాగోబా జాతరకు భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 600 మంది పోలీసులు.. 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత..
* నేటికి 16వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా.. మహాకుంభ్ కు భారీగా తరలి వస్తున్న భక్తులు..
* నేడు భారత్- ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్.. రాజ్ కోట్ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 75,390.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 82,240.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 1,03,900.