Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు.
YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వైసీపీ బృందం కలవడానికి వెళ్లింది. అయితే, డీజీపీ అందుబాటులో లేరని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశానికి వెళ్లారని కార్యాలయ సిబ్బంది పేర్కొనింది. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా కనీసం ఏ అధికారి మా రెప్రజెంటేషన్ ను కూడా తీసుకోవడం లేదని వైసీపీ బృందం ఆరోపించింది.
Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు..
AP MLC Elections 2025: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ తెలిపారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీ సతీమణి వచ్చారు. వంశీని కలిసేందుకు ఆమెను పీఎస్ లోపలకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో మీడియాతో మాట్లాడియా వంశీ భార్య పంకజశ్రీ.. మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని క్వశ్చన్ చేశారు.
Guntur SP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు చేసిన వారిపై కేసులు పెడుతున్నారు అనే వాదనను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తోసిపుచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయంలో నోటీసులు ఇచ్చామే కానీ.. కేసులు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు.