Purandeswari: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి లేఖ రాశారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఎర్ర కాలువ పునరుద్ధరణకు 268.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నల్లజెర్ల, దేవరపల్లి మధ్య 6 కిలోమీటర్ల నిడివిలో కుడి, ఎడమ గట్టుల శాశ్వత పునరుద్ధరణకు రూ. 72 కోట్లు ఇవ్వాలన్నారు.
Ambati Rambabu: టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు.. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని పేర్కొన్నారు.
MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులు అందరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు.
Speaker Ayyanna Patrudu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
CPI Ramakrishna: రాయలసీమ సాగు నీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రి రావు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి అన్నారు.
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరి కొందరి ప్రమేయంపై సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆరా తీస్తుంది. గత రాత్రి అరెస్టు చేసిన నలుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది.
Andhra Pradesh: జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకొని యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కి తరలించారు.
Student Kidnapped: కాకినాడ జిల్లాలోని తునిలో పరమేశ్ అనే బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. భాష్యం స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడుని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు బాబుకి టానిక్ పట్టించాలని చెప్పి.. పాఠశాల నుంచి బయటకు తీసుకొచ్చారు సదరు దుండగులు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 - 26కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.