అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియ చేస్తా.. క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు.
విశాఖ జిల్లా గోపాలపట్నంలో నవ వధువు కేసులో సంచలన విషయాలు.. పెళ్లైన నెల రోజుల నుంచే భార్యకు వేధింపులు.. పర్వర్ట్గా మారి భార్యను వేధించిన నాగేంద్ర.. పోర్న్ వీడియోలకి బానిసగా మారి భార్యతో వికృత చేష్టలు.. రోజూ ట్యాబ్లెట్లు వేసుకుని భార్యకు నరకం చూపిన నాగేంద్ర.. అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న మృతురాలి తల్లి..
Home Minister Anitha: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు.
Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు.
Minister Sandhya Rani: విజయనగరంలోని వన్ టౌన్ పరిధిలో గల కలెక్టరేట్ దగ్గర తన బ్యాగ్ మిస్సైనట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్ మెన్ జీవి రమణ తెలిపారు. మిస్ అయిన బ్యాగులో 30 రౌండ్స్ కలిగిన గన్ మ్యాగ్జైన్ తో పాటు విలువైన పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.
CM Chandrababu: జల వనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే.. ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.