వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్నీ నిర్ణయాలను ముఖ్య నేతలతో చర్చించి మాజీ సీఎం, వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పలు పార్టీ అంశాలపై వారు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తుంది.
MP Midhun Reddy: పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు లేవనేత్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
Kakani Govardhan Reddy: ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి.. బాటిల్ చూపించి పదే పదే చూపించారు.
CM Chandrababu: అడవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అడవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.
YCP Party: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల నోటీసులకు కార్యాలయ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయి.
Minister Kandula Durgesh: ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.
Lakshmi Reddy Arrest: తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుంది. తిరుపతి మొదటి అదనపు సివిల్ కోర్టు ఆదేశాలతో జైపూర్ కు లక్ష్మీని తీసుకెళ్ళడానికి సిద్దమైన పోలీసులు..
AP Liquor Rates Hike: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ సందర్భంగా, 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bird Flu: తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది.