Pawan Kalyan: పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతాం
- పళని అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్..
- పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతాం..
- ఇతర రాజకీయాల అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదు: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాలను ఏపీ డిప్యూటీ సీఎం పనవ్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ రోజు రోప్ వే ద్వారా పళని అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి ఆలయానికి డిప్యుటీ సీఎం పవన్, ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి చేరుకున్నారు. పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగ థాయ్-పూస.. థాయ్ పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్థాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీకరించారు.
Read Also: Chhaava’s Public Review: ‘ఛావా’ సినిమా చూసి కంటతడి పెడుతున్న ప్రేక్షకులు..
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియ చేస్తా.. క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు నన్ను కోరారు.. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లాను అని ఆయన వెల్లడించారు. తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలని ఇక్కడికి వచ్చా.. ఇతర రాజకీయాల అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!