Chintamaneni: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల దెందులూరులో చోటు చేసుకున్న ఘటనలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు చింతమనేని.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ వంశీ లోనికి వెళ్ళాడు, రేపు కొడాలి నాని వెళ్తాడు, ఎల్లుండి మరో నేత వెళ్తాడు అని పేర్కొన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయి.. వారి సంగతి ఎప్పుడు అని ప్రజలు కోరుతున్నారు.. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. వంశీ ఏ తప్పూ చేయకుండానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం అయిందా అని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.
Read Also: Pawan Kalyan: పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతాం
ఇక, అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు. తన పొలంలో తాను వ్యవసాయం చేయలేని పరిస్థితికి ఎందుకు దిగజారాడో అబ్బయ్య చౌదరి సమాధానం చెప్పగలడా? అని ఆయన అన్నారు. దెందులూరు ఘర్షణలో నా తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నాడు.
Read Also: Madhu Yashki Goud: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి..
అయితే, నా గురించి గంటా అరగంటా అంటూ మాట్లాడే అంబటి సర్టిఫికెట్ ఇస్తాడా?.. అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. సుకన్య, సంజనల సర్దిఫికేట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలుసు.. నోరు ఉంది కదా అని ఆంబోతులా రంకెలు వేయటం ఇకనైనా మానుకోవాలి అని సూచించారు. ఇలా రంకెలేస్తేనే ప్రజలు కాల్చి పెట్టిన వాతలు చూపించుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారంటూ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నాతో గొడవ పెట్టుకుందామని అబ్బయ్య చౌదరి చేసిన ట్రాప్ లో నేను పడలేదు.. పోలవరం కాల్వ బాధితులకు చెల్లించాల్సిన రూ.6 కోట్లు ఎగ్గొట్టే కుట్రలో భాగంగానే నాతో గొడవకు ప్లాన్ చేశాడని చింతమనేని చెప్పుకొచ్చాడు.