* నేడు తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశ పెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి.. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ.. కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం..
* నేడు తెలంగాణ అసెంబ్లీ 10వ రోజు బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీలో పలు బిల్లులను ప్రవేశ పెట్టనున్న మంత్రులు..
* నేడు రెండో రోజు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం.. జిల్లాల్లోని ప్రధాన సమస్యలను వివరించనున్న కలెక్టర్లు.. ఒక్కో కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయింపు.. రెవెన్యూ సమస్యలు, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, పథకాల అమలుపై చర్చ..
* నేడు సాయంత్రం 6గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ సీఎం జగన్..
* నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ పిటిషన్..
* నేడు విష్ణుప్రియ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. తనపై నమోదైన బెట్టింగ్ కేసు క్వాష్ చేయాలని పిటిషన్.. అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని కోరిన విష్ణుప్రియ..
* నేడు SLBC టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం.. మరో ఆరుగురు కోసం కొనసాగుతున్న తవ్వకాలు..
* నేడు ఏపీలోని 108 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం.. ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారుల హెచ్చరిక..
* నేడు తెలంగాణలో పొడి వాతావరణం.. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం..
* నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా మ్యాచ్.. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం..