ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister Uttam: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యంతో ఒక మాఫీయా నడిపిస్తున్నారు.. కేబినెట్ నిర్ణయం మేరకు రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం.
Minister Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ-2025 బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.
మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎందుకు ఎగ్జైట్ అవుతారు.. మంత్రులకు సంయమనం ఉండాలి అన్నారు. మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నీలాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. దోచుకున్న ది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది మీరు.. మాపై నిందలు వేస్తారా…
Minister Ponguleti: తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పై ప్రజలు తీర్పు ఇచ్చారు.. మా సభ్యులే కాదు.. మీ వైపు ఉన్న సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.
ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
BRS MLCs Protest: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేసింది. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తుంది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా కారు పార్టీ ఎమ్మెల్సీల నిరసన చేశారు.
Minister Thummala: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రూపాయల రుణమాఫీని కూడా ఒకే దఫాలో చెయ్యాలని ఆలోచన చెయ్యని వారు.. రెండో సారీ అధికారంలోకి వచ్చాక కూడా రుణ మాఫీకే రైతులను గోస పెట్టి ఎన్నికల వస్తున్నాయి.
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాలలో ఈ నెల (మార్చ్) 3వ తేదీన జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు చేధించారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు (మార్చ్ 26) శాసన సభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో వివిధ శాఖల పద్ధులపై చర్చ జరగనుంది.