Pakistan: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించాడు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలన్నారు.
IND vs Ban: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ రాష్ట్రంలోని భోపాల్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన రీల్ చూస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చిన తనపై దాడి చేశారని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Power Outage: యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. దీంతో లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది.
CM M K Stalin: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు.
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై రంగంలోకి దిగింది ఏఐసీసీ.. పార్టీ లైన్ కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
Rafale-M Jets: భారత నౌకాదళం చేతికి మరో అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్ మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారలు సమక్షంలో సంతకాలు జరిగాయి.