MRK Panneerselvam: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పై డీఎంకే మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టిక్కెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడు అని మండిపడ్డారు.
Minister Seethakka: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ చూసాకా... ఓ నియంత అధికారం పోయాక ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంది అని మంత్రి సీతక్క ఎద్దవా చేశారు. బాధ ఎవరి కోసం.. అధికారం పోయిందని బాధ తప్పితే ఇంకేం బాధ అని ప్రశ్నించింది.
Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు.
కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందన్నారు. కానీ, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని అడిగారు. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు అని అడిగారు..
BRS Silver Jubilee Meeting: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి.. ఎన్నో అవమానాలు ఎదురైనా.. ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న కసితో పోరాడి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది భారత రాష్ట్ర సమితి.
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు.
Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చాలా చురుకుగా అమలు చేస్తోంది. ఇందులో.. కీలకమైన ఎకనమిక్ కారిడార్లు, ఇతర వ్యూహాత్మక అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు, పర్యాటకాన్ని ప్రోత్సహించే, అనుసంధానతను పెంచే, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసే వివిధ ప్రాజెక్టులున్నాయి.
Omar Abdullah: పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు.
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.