బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో రేపు (ఏప్రిల్ 27వ తేదీన) నిర్వహించబోతున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారు పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాడానికి సిద్ధమైంది.
DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
V. Srinivas Goud: రజతోత్సవ సభతో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ తమకు అండగా ఉన్నారు అనే ధైర్యం మళ్ళీ ప్రజల్లో కలుగుతోంది.. కేసీఆర్ ప్రసంగం వినేందుకు లక్షలాదిగా రేపు వరంగల్ సభకు తరలి రానున్నారు.
మదర్సలోఉన్న పిల్లలు ఈ దేశం పిల్లలు అని మీ ఎస్పీ చెప్పగలరా అని ఎంపీ రఘునందన్ రావు అడిగారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని కాపాడుతున్నారు.. అక్కడ మదర్సలో ఉండే 12 ఏండ్లలోపు పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు.
కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ సభ పైనా ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకే ఇంట్రెస్ట్ పెరిగింది అని సెటైర్ వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.
MLA Kunamneni: శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
CM Chandrababu: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ మేరకు ఉగ్రవాదులది పిరికిపంద చర్య, ఈ హింసను ఖండిస్తున్నామన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం.. దేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది.