EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.
Jagga Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి.. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు.
Leopard: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నవనాధ సిద్ధుల గుట్ట సమీపంలో భయం భయంగా ఉంది. చిల్డ్రన్ పార్క్ సమీపంలోని రాళ్ళ మధ్యలో చిరుతను స్థానికులు చూశారు. దీంతో చిరుత వీడియోను భక్తులు చిత్రీకరించారు.
Basara Triple IT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగు మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోని కాంట్రాక్టర్లకే మళ్ళీ అప్పగించేలా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.
Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నాలుగు మెస్ లకు ఆన్ లైన్ టెండర్లు పిలిచింది. మార్చి 20వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే, వచ్చిన ప్రైస్ బిడ్ లను తెరిచి టెక్నికల్ ప్రాసెస్ పూర్తి చేసింది కమిటీ.
Student Missing: లండన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి లండన్ లో ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు. కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్ళి అదృశ్యమైయ్యాడు.
Pakistani Nationals: కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు..
Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక, బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల విడుదలయ్యే అవకాశం ఉంది.