Pakistan: భారత్తో వైరం వద్దు.. పరిష్కారం వెతకండి.. పాక్ ప్రధానికి సోదరుడి సూచన
- పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు..
- పాక్ ప్రధాని హెహబాజ్ కి కీలక సూచనలు చేసిన నవాజ్ షరీఫ్..
- భారత్తో వైరం వద్దు.. దౌత్య పరిష్కారం వెతకండి అని నవాజ్ సలహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించాడు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని తన సోదరుడైన, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సూచించినట్లు పలు వార్త కథనాలు వస్తున్నాయి. నవాజ్ నివాసంలో వీరి మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తుంది.
Read Also: IND vs Ban: పాక్‌తో పాటు బంగ్లాదేశ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కాగా, పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన ఘటనలో 26 మంది చనిపోయారు. దీంతో భారత్, పాక్‌ల మధ్య విభేదాలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాయాది దేశం కూడ సిమ్లా ఒప్పందంతో పాటు తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఈ దాడి తర్వాత పాకిస్తాన్ నేతలు రెచ్చిపోతున్నారు. భారత్‌పై దాడి చేసేందుకే తమ దగ్గర 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షల్లో హిందూ, ముస్లింలు వేర్వేరు అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఏర్పాటుకు తమ పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.. వాటిని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కామెంట్స్ చేశాడు. మరోవైపు, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ సైతం నోరు పారేసుకున్నాడు.. సింధూ నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సింధూ నది తమదే, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనని భారత్‌పై విమర్శలు చేశాడు. ఈ వివాదం క్రమంగా పెరిగి పోతుండటంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!