IND vs Ban: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే పాక్- బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు గత వారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గామ్ లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తో లష్కరే తోయిబా నేతలు సమావేశం కావడం గమనార్హం.
Read Also: Buffalo Milk vs Cow Milk: గేదె పాలా లేక ఆవు పాలా..? ఏవి తాగితే ఎక్కువ ప్రయోజనం.!
ఇక, బీజేపీ నేత నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. లష్కర్-ఎ-తోయిబా నేతలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని తేల్చి చెప్పారు. ఉగ్రవాద చొరబాట్లను ఆపడానికి, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా 1996లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్‌తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసినట్లే.. బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు.
Read Also: AjithKumar : పద్మ భూషణ్ అందుకున్న అజిత్ కుమార్..
అలాగే, బీహార్, పశ్చిమ బెంగాల్ సీఎంలు నీతిశ్ కుమార్, మమతా బెనర్జీలు కూడా తీస్తా జల ఒప్పందాన్ని వ్యతిరేకించారు అని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీంతో పాటు బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్‌లోకి వెళ్లడానికి నిరాకరించారు. ఎంతకాలం పాములకు నీళ్లు అందిస్తాం?.. వాటిని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైంది అని బిశ్వ శర్మ తెలిపారు. భారతదేశం మొత్తం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై నమ్మకం పెట్టుకున్నాయి.. త్వరగా బంగ్లాదేశ్ తో చేసుకున్న గంగా- బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు.