Southwest Monsoon: దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
Saraswati Pushkaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఎల్లుండి ఉదయం 5.44 గంటలకు సరస్వతీ పుష్కరాలను శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఘనంగా ప్రారంభించనున్నారు.
India-Pakistan War: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్, పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో పాక్ కి చెందిన డ్రోన్లు దూసుకు రావడంతో భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. వరుస ఘటనలతో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు.
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికార పార్టీ. కానీ.. పవర్లో ఉన్న పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ కనిపించడం లేదని సొంత నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా... నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. తల మాత్రమే ఉండి మొండెంలేనట్టుగా మారిపోయిందట తెలంగాణ కాంగ్రెస్.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.
ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలైన బహావల్పుర్, మురుద్కేపై భారత సైన్యం మెరుపు దాడి చేసి బీభత్సం సృష్టించింది అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏం చేస్తుందో క్లియర్ గా చెప్పింది అన్నారు. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే డ్రోన్లు, మిసైల్లను పూర్తిగా ధ్వంసం చేశాం.
ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు చూపించాం అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన.. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ అని కొనియాడారు.
Minister Ponnam: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముక్తకంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చాక ముందే.. ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు ప్రధాని మోడీ.
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సదర్భంగా ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు.