WTC Final- IPL 2025: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా జూన్ 11-15 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో సౌతాఫ్రికా, ఆస్ట్రే
KTR: ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నా
Law College: కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) మంజూరు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. లా కాలేజీ అనుమతికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.
ఇంగ్లాడ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కుంటిసాకులతో నిర్మాణాలను ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి.
Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు.
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.
PM Modi Warns Pak: ఆదంపుర్లో భారత సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ భారత సైన్యం శపథం చేసింది.. మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయని అన్నారు.
పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.