India-Pakistan War: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో పాక్ కి చెందిన డ్రోన్లు దూసుకు రావడంతో భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. వరుస ఘటనలతో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. అయితే, కాల్పుల విరమణను ఉల్లంఘించవద్దని పాకిస్తాన్‌కు భారత సైనిక అధికారులు హెచ్చరించారు. ఇకపై ఏవైనా ఉల్లంఘనలు జరిగితే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామని పేర్కొన్నారు.
Read Also: Off The Record: మరోసారి జగన్ పాదయాత్ర…?
కాగా, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారులు బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు. మరోవైపు, బడ్మేయర్, జై సల్మేర్, బికనీర్, శ్రీగంగానగర్ లలో పాక్షికంగా బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు. సాంబ సెక్టార్ లో డ్రోన్లు కనిపించడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.