Saraswati Pushkaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఎల్లుండి ఉదయం 5.44 గంటలకు సరస్వతీ పుష్కరాలను శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఘనంగా ప్రారంభించనున్నారు. ఇక, అదే రోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వరాలయాన్ని దర్శించుకోనున్నారు.
Read Also: CS Ramakrishna Rao: క్వాలిటీ విషయంలో అసలు తగ్గొద్దు.. అధికారులకు సీఎస్ ఆదేశాలు..!
ఇక, సరస్వతీ మాత విగ్రహం ఆవిష్కరణ, గోదావరి హారతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 790 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఈ పుష్కరాలను వెళ్లనున్నాయి. కాగా, పుష్కరాల కోసం పోలీసుల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో సుమారు 3500 మంది పోలీసుల విధులు నిర్వహించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.