Southwest Monsoon: అండమాన్ నికోబార్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు..
- అండమాన్ నికోబార్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు..
- చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు..
- ఈ నెల 27వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకే అవకాశం..
- జూన్ 12వ తేదీ వరకు తెలంగాణను తాకనున్న నైరుతి రుతుపవనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Southwest Monsoon: దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ చెప్పుకొచ్చింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Read Also: Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్‌లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
కాగా, సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయి. కానీ, ఈ సారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలా, జరిగితే 2009 తర్వాత అంచనాల కంటే ముందే రుతుపవనాలు రావడం మళ్లీ ఇప్పుడే. అప్పుడు, మే 23వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకగా.. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. ఇక, జూన్ 12వ తేదీ వరకు తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తెలంగాణలో ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగియనుంది అని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!