Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసు కాపీని అంటించారు. ఆ నోటీసు కాపీలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రొక్లైమ్డ్ ఆఫెండర్ గా ప్రభాకర్ రావుని ప్రకటించేందుకు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.. ఈనెల 20వ తేదీన ప్రభాకర్ రావు ఇంటికి నోటిసులు జారీ చేసిన పోలీసులు.. జూన్20వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తరామతి బరామతి దగ్గర ఉన్న ప్రభాకర్ రావు విల్లా నెంబర్ 38కి పోలీసులు నోటీసులు అంటించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన CR. NO. 243/2024, సెక్షన్ 82 సీఆర్పీసీ, సెక్షన్ 84 బీఎన్ఎస్ యాక్ట్ కింద ఏ1 ప్రభాకర్ రావు హాజరు కోరుతూ ప్రొక్లమేషన్ జారీ చేశారు.