Rain Alert: తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ కేంద్రం వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేయగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. రేపు పలు జిల్లాల్లో దాదాపు 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ ఇవ్వడంతో చురుకుగా కదులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
Read Also: Kannappa: హార్డ్ డిస్క్ మిస్సింగ్.. ఇది చేసిందెవరో మీ అందరికీ తెలుసు
అయితే, హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని, మ్యాన్ హోళ్లు, నాలాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు పలు సూచనలు జారీ చేశారు.