ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్‌లతో కూడిన 19 ప్యాలెట్లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు.
India-Pakistan: సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్‌కు ఇప్పటి వరకు 4 లేఖలను రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా.. మిగతా 3 లేఖలను ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని పలు జాతీయ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నాయి.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక సర్కార్.. సీఎం సిద్ధరామయ్యు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. గోవింద రాజ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ
CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు గురువారం రాత్రి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్లో రేఖ గుప్తాను చంపేస్తామని పేర్కొన్నారు.
Bomb Threat: బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఈరోజు (జూన్ 6న) బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి అందులో పేర్కొనింది.
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తొలిసారి కాశ్మీర్ లోయలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబమని అన్నారు.
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.