Minister Uttam: బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ఆర్ధిక నష్టం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరి నదిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
Bar License Applications: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు భారీ ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 అప్లికేషన్లు వచ్చాయి.
Telangana Cabinet: రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీకి వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ఈరోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. అయితే, కొత్తగా కేబినెట్ లోకి ముగ్గురిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.
Konda Vishweshwar Reddy: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనది.. చేవెళ్ళకు ఒక చుక్క నీరు రాదు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేవలం మాయమాటలు కాంగ్రెస్ చెప్పింది.. కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తారు అనుకుంటే.. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు పెట్టారు.. కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉంది.
నా 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల చెప్పిన సమాధానాలు చూసి బాధ, అనుమానం వ్యక్తమయ్యాయి.. నేనే సుమోటోగా కాళేశ్వరం కమిషన్ కు సబ్ కమిటీ రిపోర్టు, ఇతర వివరాలు అందిద్దామని అనుకుంటున్నాను.
Dy CM Bhatti: తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏపీలోని కర్నూలులో గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ చూశాను అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగం పెరిగింది.. థర్మల్ విద్యుత్ ఖర్చు, కాలుష్యం కూడా పెరిగింది.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాల్సి ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నాడు..