Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు.
IPL Chairman: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాట గురించి లోపల ఉన్న అధికారులకు బయట ఏం జరుగుతుందో తెలియదని అన్నారు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట.. ఒక పీడకలగా మారింది అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా పేర్కొన్నారు. ఒక వైపు, తొక్కిసలాట జరిగిన అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటే.. వేదికపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాత్రం క్రికెటర్లతో కౌగిలింతలు, ఫోటోలు తీసుకోవడంతో చాలా బిజీగా ఉన్నారని ఆరోపించారు.
RCB Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే, ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తీవ్ర చోటు చేసుకుంది.
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.
Caste Census Survey: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కుల గణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు చెప్పారు.