సంజూకు సంబంధించి మరో ప్రచారం తాజాగా మొదలైంది. వచ్చే సీజన్లో కేకేఆర్‌కు శాంసన్ ఆడబోతున్నాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ హింట్ ఇచ్చాడు. తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌లో సంజూతో చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో దర్శనమిస్తుంది. ఈ ఫోటోకు బిజూ కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవిగా ఉండిపోతాయని క్యాప్షన్ ఇచ్చాడు.
KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ...రెండు రాష్ట్రాల మధ్య ఉన్న, నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
Drugs Party In Hyderabad: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.
Shiv Sena MLA: ముంబైలో హాస్టల్ క్యాంటీన్లో నాసిరకం భోజనం పెట్టారని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటిన్ సిబ్బందిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇవాళ (గురువారం) దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన.
Iran Warns Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ట్రంప్ ఫ్లోరిడా నివాసం సేఫ్ కాదని.. అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్‌ను ఢీకొట్టే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు.
సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.
Maharashtra: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్రూమ్లో రక్తపు మరకలు కనిపించడంతో 12 ఏళ్ల పైబడిన అందరూ బాలికలను హాల్ లోకి నిలబెట్టి.. పీరియడ్స్ ఉన్నవారు ఒకవైపు, లేనివారు మరో వైపుగా విడదీశారు.