Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక చీకటి అధ్యాయం.. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో అందరి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచి వేసే ప్రయత్నం చేశారని ప్రాజెక్టు సిండికేట్ అనే వెబ్‌సైట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓ వ్యాసం రాశారు.
Read Also: Nakrekal: నా కోడికి న్యాయం కావాలి.. పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతి..!
ఇక, దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడం కోసం బయటి నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ లాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆలోచించి.. తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కానీ, ఈ తప్పుడు విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయని చెప్పుకొచ్చారు. దాదాపు జూన్ 21 నెలల పాటు కొనసాగిన అత్యవసర పరిస్థితిలో పౌరుల స్వేచ్ఛ, మీడియా, ప్రతిపక్ష నేతలు పూర్తిగా అణిచివేయబడ్డారని తెలిపారు.
Read Also: Sheikh Hasina: మనస్సాక్షి ప్రకారం అప్పగించండి.. షేక్ హసీనాపై భారత్‌కు బంగ్లాదేశ్ కొత్త ప్రతిపాదన
అలాగే, ప్రజలు 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీని తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించారు అని శశిథరూర్ తన వ్యాసంలో రాసుకొచ్చారు. ఎమర్జెన్సీ సమయం మాత్రమే భారత చరిత్రలోని ఒక చీకటి అధ్యాయంగా గుర్తు పెట్టుకోవడమే కాకుండా, దాని నుంచి పాఠాలను నేర్చుకోవాలి అని సూచించారు. ప్రజాస్వామ్యం అనేది వారసత్వం లాంటిది.. దానిని నిరంతరం పోషిస్తూ.. సంరక్షించుకోవాలని తెలిపారు. మరోసార ఇలాంటివి పునరావృతం కాకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.