Maharashtra: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు కనిపించడంతో 12 ఏళ్ల పైబడిన అందరూ బాలికలను హాల్ లోకి నిలబెట్టి.. పీరియడ్స్ ఉన్నవారు ఒకవైపు, లేనివారు మరో వైపుగా విడదీశారు. ఈ సందర్భంగా మైనర్ బాలికలను ఋతుస్రావం లేదని చెప్పినప్పటికీ, స్కూల్ ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు అటెండెంట్ (ప్యూన్) వారిని శారీరకంగా తనిఖీ చేయించింది. ఈ చెకింగ్ సమయంలో సదరు ప్యూన్ బాలికల అంతర్వస్త్రాలను తాకినట్లు సమాచారం. ఆ సమయంలో ఒక బాలిక సానిటరీ న్యాప్‌కిన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
Read Also: Trump Tariffs: బ్రెజిల్ సహా మరో 7 దేశాలపై భారీగా సుంకాలు.. పోర్చుగీస్పై మాత్రం 50 శాతం టారీఫ్స్!
అయితే, ఓ మైనర్ బాలికకు పీరియడ్స్ లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆ పాఠశాల ప్యూన్ చేత బలవంతంగా ప్రిన్సిపాల్ బట్టలు విప్పించించింది. ఆ బాలిక సానిటరీ న్యాప్‌కిన్ ఉపయోగించడంతో ఆ అమ్మాయిని బహిరంగంగానే అందరూ విద్యార్థులూ, సిబ్బంది ముందే తీవ్రంగా దూషించింది. ఈ విషయం సదరు స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాల దగ్గర విద్యార్థి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఈ ఘటనపై స్కూల్ మేనేజ్‌మెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్, ప్యూన్ తో పాటు సహా ఇద్దరు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలపై కేసు నమోదైంది. ఇక, ప్రిన్సిపాల్, ప్యూన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులపై విచారణ కొనసాగుతోందని మహారాష్ట్ర పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు.