KA Paul: బెట్టింగ్ యాప్స్‌లో సెలబ్రిటీలపై కేసు.. బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా..?
- బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు..
- బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా.. బాలకృష్ణ, కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా?..
- బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే.. ఈవీఎంలను మేనేజ్ చేసి తెలంగాణ 8 ఎంపీ స్థానాల్లో గెలిచారు: కేఏ పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశా.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఈ కేసులో బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చెయ్యరు?.. కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా? అని అడిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తుంది అని ఆరోపించారు. అలాగే, సిగాచి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓనర్లను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?.. ఇదే యూరోపియన్ దేశాల్లో జరిగి ఉంటే కఠిన చర్యలు ఉండేవి, ఇండియాలో మాత్రం బెయిల్స్ వస్తాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు.
Read Also: Bihar Elections: గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
అయితే, అదానీ, అంబానీలకు 15 లక్ష కోట్లు రుణమాఫీ చేస్తారు, కానీ పేదలకు మాత్రం ఏం చేయరు అని కేఏ పాల్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అమ్ముడు పోయారు.. సూపర్ సిక్స్ గురించి అడిగితే నాలుక కొస్తారా?.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని ప్రజలు కోరుకుంటే పెడుతాను అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పెట్టుకున్నట్లే అన్నారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. 5 శాతం లేని బీజేపీ 8 సీట్లు ఎలా గెలిచింది.. ఎందుకో తెలుసా.. బీఆర్ఎస్, ఈవీఎంల మహిమ వల్లే 8 ఎంపీ సీట్లలో గెలిచిందన్నారు. పురంధేశ్వరికి డిపాజిట్ కూడా రాకూడదు, కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!